మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి.
మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్):
మండల పరిధిలోని చిన్న నల్లబల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూనెం బాపనయ్య శనివారం గుండెపోటు తో అకస్మాత్తుగా మృతి చెందారు.ఆయన మరణ వార్తతో చిన్న నల్లబల్లి గ్రామంలో విషాద శాయలు అలుముకున్నాయి.
గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో బాపనయ్య గ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని స్థానిక నాయకులు కొనియాడారు.సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా గ్రామంలో ఎటువంటి గొడవలు,తగాదాలు వచ్చినా బాపనయ్య గారే ముందుండి పెద్దరికం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పి ఎవరికీ నష్టం జరగకుండా ఎన్నో కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి ఆదర్శవంతమైన తీర్పులు చెప్పేవారని గ్రామ పెద్ద దిక్కుగా ఉండి అందరినీ కలుపుకెళ్లే ఆయన నాయకత్వాన్ని కోల్పోవడం గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.పూనెం బాపనయ్య మృతి పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.నేడు చిన్ననల్లబల్లి కాలనీ వారి స్వగృహంలో అంత్యక్రియలు జరుగుతాయి.