BREAKING
జిల్లా వ్యాప్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' -స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి -గంజాయి, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే 'అ'.. అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్: హీరో రాహుల్ విజయ్ నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. ! శ్రీకృష్ణ నామస్మరణతో... మార్మోగిన నాగరగూడ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి వైసిపి నేతలకు రాష్ట్ర జిల్లా స్థాయి పదవులు మైసూర్ దసరా 2026: బంగారు అంబారీ రేసు నుంచి మహేంద్ర తాత్కాలికంగా అవుట్.. పెద్దల అమావాస్య.. తల్లిదండ్రుల సేవపై ఆధ్యాత్మిక సందేశం రోడ్డు విస్తీర్ణ పనులకు పంతొమ్మిది కోట్లు మంజూరు శరన్నవరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

నేటి నుండి వాసవి లో ప్రారంభం కానున్న నవరాత్రులు

Select Suryaa Now
నేటి నుండి వాసవి లో  ప్రారంభం కానున్న నవరాత్రులు

తాడేపల్లిగూడెం , మేజర్ న్యూస్:తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 59వ శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయని  ఉత్సవ కమిటీ అధ్యక్షులు వబిలిశెట్టి నటరాజ్  తెలియజేశారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను రిలీజ్ చేశారు. 22 మంది వేత పురోహితుల మధ్య లక్ష కుంకుమార్చనలు, అష్టోత్తర శతకమల హోమాలు, సుహాసిని పూజలు, కుంకుమ పూజలు నిర్వహించనున్నారని నటరాజ్ తెలియజేశారు. తాడేపల్లిగూడెం శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో అధ్యక్షులు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, కార్యదర్శి నున్న బాలత్రిపుర సుందర రావు, కోశాధికారి బోగవిల్లి రమేష్, ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి కృష్ణకుమార్ మరియు వివిధ కమిటీల సహాయ సహకారాలతో పూజాది క్రతువులు నిర్వహించనున్నారని తెలియజేశారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో తెప్పోత్సవం రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారని వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు వాసవి పెయింట్స్ పెనుగొండ శ్రీనివాస్, సూరిబాబు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా