అవుశాపూర్ సర్వీస్ రోడ్డుకు సోలార్ వెలుగులు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు ఏనుగు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10): హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై అవుశాపూర్ సర్వీస్ రోడ్డులో ఏళ్ల తరబడి నెలకొన్న చీకటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వీధి దీపాలు లేక రాత్రివేళల్లో రాకపోకలు సాగించే పాదచారులు, స్థానిక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించిన మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) వరంగల్ అధికారులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందించిన అధికారులు సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు.సోలార్ లైట్ల ఏర్పాటు పనులను ఏనుగు సుదర్శన్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, లైట్ల ఏర్పాటుకు సహకరించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ లైట్ల ఏర్పాటుతో రాత్రివేళల్లో ప్రయాణాలు మరింత సురక్షితంగా మారుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఏనుగు లక్ష్మారెడ్డి, ఏనుగు మచ్చేందర్‌రెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షుడు చిలకమారి మహేశ్, కాసుల వెంకటేశ్, గుమ్మడి సుదర్శన్, ఉప్పల నాగచారి, సయ్యద్ పర్వేజ్, సుభాన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.