BREAKING
సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు వి జనసేన స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్తగా పైడి మురళీ మోహన్ నవి పిళ్లకు నోబెల్ శాంతి బహుమతి... ఇది ప్రపంచవ్యాప్త తమిళులకు గర్వకారణం: కమల్ హాసన్

జడ్పీ టీచర్ల పీఎఫ్ లను జీపీఎఫ్ గా మార్చాలి!

Select Suryaa Now
జడ్పీ టీచర్ల పీఎఫ్ లను జీపీఎఫ్ గా మార్చాలి!

 

ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి పై స్పందించిన ఎమ్మెల్సీ...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు లేఖ

ఎస్.రాయవరం, రాష్ట్రంలో జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలను జీపీఎఫ్ ఖాతాలుగా మార్చాలని కోరుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి కి ఎమ్మెల్సీ గాదె తక్షణమే స్పందించి ఈ లేఖ రాశారు. రాష్ట్రంలో జడ్పీ టీచర్ల నియామకాలు, జీతాల చెల్లింపు జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, అలాగే ఉపాధ్యాయుల సర్వీస్ మేటర్స్ అన్నీ విద్యాశాఖ ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతున్నాయని ఆ లేఖలో ఎమ్మెల్సీ స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ పీఎఫ్ అకౌంట్లు మాత్రం ఇంకా జిల్లా పరిషత్ యాజమాన్యంలోనే కొనసాగుతున్నాయని, వాటిని వెంటనే జీపీఎఫ్ లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో, కొత్త జడ్పీలకు పీఎఫ్ ఖాతాలను బదలాయించకుండా, పాత జిల్లాలు మరియు కొత్త జిల్లాలను కలిపి జీపీఎఫ్ లుగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు తన లేఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు.