BREAKING
అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా వంగలపూడి మధుబాబు నియామకం! చెరువు వద్ద శుభ్రత ఎక్కడ.. ఎంగిలిపూల బతుకమ్మ ఆడేది ఎట్లా జడ్పీ టీచర్ల పీఎఫ్ లను జీపీఎఫ్ గా మార్చాలి! డర్బన్ టెస్ట్: రెన్‌షా 190తో ఆసీస్ 390.. సఫారీలు 27/1, ఇంకా 363 పరుగులు వెనుక బ్లడీ రోమియో' కోసం నేచురల్ స్టార్ నాని అల్ట్రా స్టైలిష్ మేకోవర్... రఫ్ అండ్ రెబల్ లుక్ పిక్స్ వైరల్ *మధిరలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి* హైదరాబాద్‌లో మైనర్ బాలిక అక్రమ రవాణా కేసు: 24 గంటల్లో 8 మంది అరెస్ట్ స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు - మేయర్ పదవులకు 35.29%..జడ్పీ చైర్మన్‌కు 23.08% శాతం -రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం నియోజకవర్గం ఎన్నికల కమిటీ 'నిర్వాహక్' గా అచ్యుతరావు! సందీప్ కిషన్ 'కరికాల'లో కేథరిన్ థ్రెసా... అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో వెల్కమ్ చెప్పిన మేకర్స్ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు... టీమ్‌కు శుభాకాంక్షలు జిల్లా వ్యాప్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' -స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి -గంజాయి, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే 'అ'.. అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్: హీరో రాహుల్ విజయ్

పులి సంచారంతో గ్రామాల్లో కలకలం.. ప్రజల్లో ఆందోళన పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన వడ్డి రఘురామ్ నాయుడు

Select Suryaa Now
పులి సంచారంతో గ్రామాల్లో కలకలం.. ప్రజల్లో ఆందోళన  పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన వడ్డి రఘురామ్ నాయుడు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల, నందమూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని సందర్శించి, గ్రామస్థులు మరియు రైతులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పులి ఎక్కడ కనిపించింది, ఏయే ప్రాంతాల్లో సంచరిస్తోంది, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటనే వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి కదలికలను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం వంటి చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, పులి సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని వడ్డి రఘురామ్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా