BREAKING
*మధిరలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి* హైదరాబాద్‌లో మైనర్ బాలిక అక్రమ రవాణా కేసు: 24 గంటల్లో 8 మంది అరెస్ట్ స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు - మేయర్ పదవులకు 35.29%..జడ్పీ చైర్మన్‌కు 23.08% శాతం -రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం నియోజకవర్గం ఎన్నికల కమిటీ 'నిర్వాహక్' గా అచ్యుతరావు! సందీప్ కిషన్ 'కరికాల'లో కేథరిన్ థ్రెసా... అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో వెల్కమ్ చెప్పిన మేకర్స్ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు... టీమ్‌కు శుభాకాంక్షలు జిల్లా వ్యాప్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' -స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి -గంజాయి, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే 'అ'.. అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్: హీరో రాహుల్ విజయ్ నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. ! శ్రీకృష్ణ నామస్మరణతో... మార్మోగిన నాగరగూడ

ఎల్‌నినోపై పార హుషార్..అధికారులకు సీఎం హెచ్చరిక

Select Suryaa Now
ఎల్‌నినోపై పార హుషార్..అధికారులకు సీఎం హెచ్చరిక

సూర్య తెలంగాణ డెస్క్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో తలెత్తే పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో కారణంగా రాబోయే రోజుల్లో తీవ్ర సంక్షోభం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీరు, సాగునీరు, వ్యవసాయం అలాగే విద్యుత్ రంగానికి సంబంధించి పకడ్బందీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ముందుగానే గుర్తించి యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సంక్షోభ పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పక్కా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో విద్యుత్ సమస్య తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ కొనుగోలుకు ఎంత ఖర్చు చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, విద్యుత్, జలవనరుల శాఖల అధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై సీఎంకు నివేదిక అందించారు. విపత్కర పరిస్థితులను ముందే అంచనా వేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.