జిల్లాలో యథేచ్ఛగా బాణాసంచా వ్యాపారం నిబంధనలకు తూట్లు పొడుస్తూ నడుస్తున్న వ్యాపారాలు
తాడేపల్లిగూడెం సూర్య న్యూస్: బాణా సంచా వ్యాపారాన్ని రాష్ట్ర పరిధిలో నిర్వహించడానికి (తాత్కాలిక దుకాణం లేదా శాశ్వత రిటైల్ షాపు) కేంద్ర ఎక్స్ప్లోసివ్ రూల్స్, 2008 మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి శాఖల నుంచి కొన్ని అనుమతులు, ఎన్‌ఓసీలు తప్పనిసరిగా తీసుకోవాలి:పోలీస్ శాఖ /రెవెన్యూ విభాగం లైసెన్స్శాశ్వత వ్యాపారం కోసం జిల్లా మేజిస్ట్రేట్ లేదా పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే పోలీస్ కమిషనర్ నుంచి ఎక్స్ప్లోసివ్ రూల్స్ ఫామ్ ఎల్ఈ 5 కింద లైసెన్స్ పొందాలి. స్థానిక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఆర్డీవో) లేదా పోలీస్ విభాగం నుంచి నిర్దిష్ట రోజుల పరిమితితో కూడిన తాత్కాలిక విక్రయ అనుమతి తీసుకోవాలి.అగ్నిమాపక శాఖ నుండిషాపు లేదా నిల్వ ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఫైర్ సర్వీసెస్ అధికారులు ఇచ్చే ఫైర్ సేఫ్టీ, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, అత్యంత కీలకం.దుకాణంలో కనీస నీటి వనరులు, ఇసుక బకెట్లు, నిర్దేశిత సంఖ్యలో పోర్టబుల్ ఫైర్ ఎక్స్‌టింగిషర్లు ( ఏబీసీ/సి ఓ 2), స్పష్టమైన అత్యవసర నిష్క్రమణ మార్గాలు ఉండాలి.స్థానిక సంస్థల ట్రేడ్ లైసెన్స్ పొందడానికి మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం లేదా గ్రామ పంచాయతీ పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి ట్రేడు లైసెన్స్ పొందాలి. నివాస ప్రాంతాలు, దట్టమైన జనాభా ఉన్న మార్కెట్లకు దూరంగా నిర్ణీత పరిమితుల ప్రకారం షాపు ఉండాలని స్థానిక సంస్థలు ధ్రువీకరించాలి.పి ఇ ఎస్ ఓ పరిమితులు మరియు నిల్వ సామర్థ్యం ప్రకారం (ఎక్స్ప్లోజివ్ యాక్ట్) రిటైల్ షాపుల్లో గరిష్టంగా 100 కిలోల నుంచి 500 కిలోల వరకు మాత్రమే బాణసంచా నిల్వ ఉంచేందుకు రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ (డీఎం / సీపీ) అనుమతి ఇస్తుంది. 500 కిలోలకు మించి నిల్వ చేయాలన్నా లేదా టోకు గోదాము (హోల్ సేల్ స్టాక్ పాయింట్) నడపాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పి ఇ ఎస్ ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోసివ్ సేఫ్టీ అండ్ ఆర్గనైజేషన్) అనుమతి తప్పనిసరి. ముఖ్యమైన డాక్యుమెంట్లు స్థల యాజమాన్య పత్రాలు లేదా రిజిస్టర్డ్ అద్దె ఒప్పందందుకాణం/గోదాము యొక్క సైట్ ప్లాన్ మరియు బ్లూప్రింట్ (చుట్టుపక్కల 15 మీటర్ల పరిధిలోని భవనాల వివరాలతో). దరఖాస్తుదారుడి గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు (ఆధార్, పాన్ కార్డ్).జీఎస్టీ (జీఎస్టీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ బిల్లులు/సర్టిఫికెట్లు అన్నీ తప్పనిసరి రెండు బాణసంచా దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల సురక్షిత దూరం ఉండాలి. అలాగే విద్యుత్ వైరింగ్ మొత్తం క్లోజ్డ్ కండ్యూట్లలో ఉండాలి, షాపు లోపల లేదా సమీపంలో ఎటువంటి ఓపెన్ లైట్లు, పొగత్రాగడం నిషేధం.కానీ ఏ విధమైన అనుమతులు లేకుండానే తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తణుకు నియోజకవర్గం ప్రాంతాలలో వ్యాపారాలు నేర్చుకో సాగుతున్నాయి. వీటికి సంబంధించి అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి అని తెలిసినప్పటికిని పలువురు వ్యాపారస్తులు వాటన్నింటినీ గాలికివదిలిపెట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలు జరిగిన తర్వాత ఎవరో ఒకరు ముద్దాయిగా తేల్చడం గతంలో రెండు మూడు పర్యాయాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో జరిగాయి. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పర్యవేక్షిస్తూ తగిన విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తాడేపల్లిగూడెం పరిధిలో 9 షాపులు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు జిల్లా ఉన్నతాధికారుల నుండి ఏ ఒక్కరికి అనుమతులు రానప్పటికిని గొడవల నిండా బాణాసంచా తో నింపేశారు. తాడేపల్లిగూడెం ఎస్ వి ఆర్ సర్కిల్ కు కోత వేట దూరంలోనే ఏర్పాటు చేయబడ్డ గొడవలలో పెద్ద మొత్తంలో బాణాసంచా నిలవలు ఉన్నాయని జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే అది హౌసింగ్ బోర్డు ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందంటూ స్థానికలు వాపోతున్నారు. తణుకు నియోజకవర్గం దువ్వ ప్రాంతంలో జాతీయ రహదారికి ఇరువైపులా అనేక బాణాసంచా వ్యాపారస్తులు వారి వారి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వీరందరికీ సరియైన అనుమతులు ఉన్నాయా, తీసుకున్న అనుమతులు సమానంగా నిలవలు ఉన్నాయా అనేది ప్రజల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. ఇది ఎలా ఉంటే పలు రహస్య ప్రాంతాలలో నాటు సరుకులు తయారవుతున్నాయని మతాబులు చిచ్చుబడ్డలు తాటాకు టపాకాయలు తయారవుతున్నాయని అవి ఆయా ప్రాంతాలకు రాత్రిపూట సరఫరా చేయడం జరుగుతుందంటూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు పర్యవేక్షించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా