BREAKING
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి, సోమవారం ఢిల్లీలో భారీ ధర్నాకు సిద్ధమైన టీకాంగ్రెస్ నల్లగొండలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ జిల్లాలో యథేచ్ఛగా బాణాసంచా వ్యాపారం నిబంధనలకు తూట్లు పొడుస్తూ నడుస్తున్న వ్యాపారాలు పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుపాను హెచ్చరికలు: ఐఎండీ జాబితా విడుదల.. అప్రమత్తంగా ఉండాలని సూచన! ఎల్‌నినోపై పార హుషార్..అధికారులకు సీఎం హెచ్చరిక అవుశాపూర్‌ సర్వీస్‌ రోడ్డుకు సోలార్‌ వెలుగులు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు ఏనుగు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి. పులి సంచారంతో గ్రామాల్లో కలకలం.. ప్రజల్లో ఆందోళన పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన వడ్డి రఘురామ్ నాయుడు నూతన యాపిల్ సీఈవో టెర్నస్‌తో పనితీరుపై స్పందించిన టిమ్ కుక్: "నేను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు.. ఆయన శైలి ఆయనదే"! రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి.. మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి. బ్రిటన్ జూలో పులుల ఎన్‌క్లోజర్‌లో భారీ ప్రమాదం, పార్క్ మూసివేత ప్రశాంతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి ఎస్ ఐ మల్లు. సంజీవరెడ్డి నేటి నుండి వాసవి లో ప్రారంభం కానున్న నవరాత్రులు

త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు


నల్గొండ మేజర్ న్యూస్


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు
నల్లగొండ, 
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో పండుగ సందడి నెలకొంది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పద్ధతుల్లో పూజించడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకతను చాటుతుందని తెలిపారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి బతుకమ్మ ఆడటం పండుగలోని ఐక్యతా సందేశాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో వైద్య సేవలతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళల్లో సంతోషాన్ని, ఆత్మీయతను నింపడంతో పాటు మన సంస్కృతిని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ త్రివేణి, సూర్యకళ, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ ప్రవీణ్, అనూష, విజయ్, పార్వతి, కల్పన, రాధా, నిర్మల, శ్రావణి, అనిత తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.