BREAKING
విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన రణబాలి అద్భుతమైన సినిమా అనుభూతిని ఇస్తుంది... చరిత్రను కళ్లకు కట్టే చిత్రమిది: హీరో విజయ్ దేవరకొండ

నల్లగొండలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ

Select Suryaa Now
నల్లగొండలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ

 

నల్లగొండ టౌన్, :నల్లగొండ నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం  నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
నగరంలోని రామాలయం, నగర మేయర్ చైతన్య బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు ఎన్జీ కాలేజీ మైదానం, హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్, మిర్యాలగూడ రోడ్, సాగర్ రోడ్, సవర్కర్ నగర్, శాంతినగర్, ఆమీల్యా కాలనీ, కలెక్టరేట్ ప్రాంతాలలో వివిధ అపార్ట్‌మెంట్లలో మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను రంగురంగుల పూలతో అందంగా పేర్చి "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అంటూ పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మకు ప్రత్యేక విశిష్టత ఉందని మహిళలు తెలిపారు. పండుగను పురస్కరించుకొని మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.