స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పరవాడ మండలంలో ఎంపీడీవో మల్లికార్జునరావు, ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రావు సంయుక్తంగా పరవాడ మండలంలోని పెదముసిడివాడ, కన్నురూ, మడకపాలెం గ్రామాల్లో ఉన్న అత్యంత సమస్యాత్మక మరియు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులను సమీక్షించి, ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
పరవాడ