BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

రణబాలి అద్భుతమైన సినిమా అనుభూతిని ఇస్తుంది... చరిత్రను కళ్లకు కట్టే చిత్రమిది: హీరో విజయ్ దేవరకొండ

Select Suryaa Now
రణబాలి అద్భుతమైన సినిమా అనుభూతిని ఇస్తుంది... చరిత్రను కళ్లకు కట్టే చిత్రమిది: హీరో విజయ్ దేవరకొండ

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రణబాలి'పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. రశ్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా దసరా పండుగ కానుకగా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో, తాజాగా హీరో విజయ్ దేవరకొండ మీడియా ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

పెళ్లిచూపులు చిత్రం తర్వాత తాను అత్యంత సంతృప్తితో, ప్రశాంతంగా ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్న సినిమా రణబాలి అని విజయ్ తెలిపారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ పనులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రీ ప్రొడక్షన్ దశలోనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ పాలన కాలంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన చారిత్రక సంఘటనలు, నాటి కరువు పరిస్థితులు మరియు ప్రజల పోరాటాలను ఈ చిత్రంలో చాలా రియలిస్టిక్ గా ఆవిష్కరించినట్లు వెల్లడించారు. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఎంతోమంది వీరుల త్యాగాలను, మన సంస్కృతిని ఈ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై చూపించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.

అప్పట్లో మన దేశంపై బ్రిటీషర్లు చూపిన నిర్లక్ష్యం, విధించిన భారీ పన్నుల వల్ల ప్రజలు పడిన వేదనను చరిత్ర ఆధారంగా లోతుగా అధ్యయనం చేసి ఈ కథను సిద్ధం చేసినట్లు విజయ్ తెలిపారు. రాయలసీమ యాసపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, రెండు మూడు నెలల పాటు కష్టపడి డైలాగ్ డెలివరీ నేర్చుకున్నానని ఆయన చెప్పారు. జయమ్మ పాత్రలో రశ్మిక నటన ఈ సినిమాకు మరింత ఎమోషనల్ డెప్త్ ను తెచ్చిపెట్టిందని, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ ప్రాజెక్ట్ కోసం పడిన తపన సినిమా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందని కొనియాడారు. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ మన చరిత్ర, సంస్కృతి గురించి చర్చించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తన సినిమాలకు టికెట్ ధరల పెంపుపై స్పందిస్తూ, కాలేజ్ రోజుల్లో తాను టికెట్ రేట్ల వల్ల పడిన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేస్తే తప్ప తన సినిమాలకు ఎలాంటి టికెట్ హైక్స్ ఉండవని విజయ్ స్పష్టం చేశారు. రెండు గంటల యాభై నిమిషాల పాటు సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గ్రేట్ సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడంతో పాటు, ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుందని తెలిపారు. దసరా బరిలో దిగుతున్న రణబాలి చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.