ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి,
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాలని, దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెంలో వామపక్ష పార్టీల నాయకులు శనివారం నిరసన తెలిపారు. కాక్రో జనతా పార్టీ పిలుపు మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఓటర్ల జాబితాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని, తొలగించిన పేర్లపై సమీక్ష నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రమణ, బాల యేసు, జి. సూర్యకిరణ్, కారం రాఘవ, ఎస్. రామ్మోహన్, నాగభూషణం, జంపన వెంకటరమణరాజు, చిలపరెడ్డి వెంకటరెడ్డి, నిజవరపు వీరభద్రం, దొంతు రాంపండు, నాని తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా