కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన
కామవరపుకోట, మేజర్ న్యూస్,మండలంలోని దొండపాటివారిగూడెం గ్రామంలో కోటి రూపాయల సీసీ రోడ్లకు శనివారం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంతో గ్రామ రూపురేఖలు మారబోతున్నాయనీ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులకు శ్రీకారం చేయటం పట్ల గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవుగ్రామాల్లో దీర్ఘకాలంగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరిస్తూ కోటి రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చాక ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలవడమే తప్ప మా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యేగా రావడం ఇదే మొదటిసారి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ కేఎస్ రామవరం, దొండపాటి వారి గూడెం ప్రజలు రోడ్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి కోటి రూపాయల నిధులు మంజూరు చేయించాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ రెండు గ్రామాలకు మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గంట సుధీర్ బాబు, రాటాలరాజు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రిపోర్టర్ సుభాష్ కామవరపు కోట ఏలూరు జిల్లా