BREAKING
తుమ్మలపెంటలో ఘనంగా వైఎస్‌ఆర్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ... సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం హెల్మెట్ ధరించిన ప్రయాణం,సుఖ ప్రయాణం: ఎస్ ఐ అమీర్ మా గ్రామంలో బాల్యవివాహాలు జరగవు - తీర్మానం చేసిన గ్రామసభలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు విద్యుత్ కోతలతో రైతాంగ పంటలకు నష్టం జరుగుతోంది నెల్లూరు రూరల్ అభివృద్దే మా లక్ష్యం మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా వర్ధంతి పరిశ్రమల పేరుతో రైతుల కడుపు కొట్టవద్దు: కావలి రైతు సంఘం. శ్రీ నికేతన్ హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు గోదాదేవి అమ్మవారికి వెండి కవచం బహుకరణ పునీత్ గ్రానైట్ ఫ్యాక్టరీలో విషాదం.. నీటి గుంటలో పడి కార్మికుడు మృతి కావలి గురుకుల పాఠశాలలో 'స్వచ్ఛత హి సేవా' – విద్యార్థులకు చెత్త సేకరణపై అవగాహన. రఘురామ కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన

పవన్ కళ్యాణ్ ఆశయాలే స్ఫూర్తిగా జనసేనలో యువత చేరికలు

Select Suryaa Now
పవన్ కళ్యాణ్ ఆశయాలే స్ఫూర్తిగా జనసేనలో  యువత చేరికలు

21వ డివిజన్‌లో కిషోర్ గునుకుల–విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఘనంగా చేరికలు

 నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతకు ఆకర్షితులై 21వ డివిజన్ పరిధిలోని పాత 16వ డివిజన్, గుర్రాలమడుగు సంఘం, రాంజీనగర్ ప్రాంతానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత జనసేన పార్టీలో చేరారు.  జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో స్థానిక 21వ డివిజన్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముందు రాంజీనగర్ 7వ లైన్‌లోని కిషోర్ గునుకుల నివాసం నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్ మీదుగా ముత్తుకూరు సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్‌లపై పాల్గొనడంతో పాటు డీజే కార్యక్రమంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. ఈ సందర్భంగా విజయలక్ష్మి గునుకుల నూతనంగా పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కిషోర్ గునుకుల … “శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దశాబ్దాలుగా అభిమానిస్తూ, ఆయన ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి  సుమంత్, రాజేష్ తదితరులు ఈరోజు పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. వృత్తి, వ్యాపారాల కారణంగా తమ తమ రంగాల్లో ఉంటూనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరంతా ఇకపై జనసేన పార్టీకి అండగా నిలవడం 21వ డివిజన్‌లో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుంది.ఈరోజు జరిగిన ఈ చేరికలు రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఒక బలమైన నాంది అని భావిస్తున్నాం. రేపటి నుంచి డివిజన్‌లో ప్రజలను నేరుగా కలుసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, ఆయన ఆశయాలను నమ్మే ప్రతి యువకుడు జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలి. యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రజల కోసం పనిచేయాలి, పార్టీని బలోపేతం చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి గడపను చేరుకుని కూటమి విజయానికి కృషి చేస్తాం. ఈరోజు సుమంత్‌ రాజేష్ తో పాటు యువత జనసేనలో చేరడం మాకు ఎంతో ఉత్సాహాన్ని, మరింత బలాన్ని ఇచ్చింది. వీరందరినీ జనసేన కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం” అని కిషోర్ గునుకుల తెలిపారు.

పార్టీలో చేరిన వారు  సుమంత్, రాజేష్,సందీప్, సుజీత్, రాజేష్, మహీష్, శ్రీకాంత్, వెంకీ, అప్పూ, వంశీ, అనిల్, శ్రీను తదితరులు జనసేన పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్, నాగేంద్ర బాబు, హేమచంద్ర యాదవ్, నరహరి, విశ్రాంత్, మహిళా నాయకులు విజయ, ప్రవల్లిక, కృష్ణవేణి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.