BREAKING
"సురక్ష రద్" మొబైల్ సేఫ్టీ ప్రారంభించిన ఆదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ కొందుర్గు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన కొందుర్గు జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దోమ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు శిలాఫలకాలే అభివృద్ధా? ఎమ్మెల్యేపై బొల్లా ఫైర్‌! తుమ్మలపెంటలో ఘనంగా వైఎస్‌ఆర్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ... సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం హెల్మెట్ ధరించిన ప్రయాణం,సుఖ ప్రయాణం: ఎస్ ఐ అమీర్ మా గ్రామంలో బాల్యవివాహాలు జరగవు - తీర్మానం చేసిన గ్రామసభలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు విద్యుత్ కోతలతో రైతాంగ పంటలకు నష్టం జరుగుతోంది నెల్లూరు రూరల్ అభివృద్దే మా లక్ష్యం మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా వర్ధంతి

తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు

Select Suryaa Now
తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు
నగరం, మేజర్ న్యూస్:
స్థానిక మండల పరిధిలోని అద్దంకివారిపాలెంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక గ్రామ ప్రజలు ఎంతో కాలంగా  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం కోట్లాది రూపాయrలు వెచ్చించి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి గ్రామంలో పైపులైన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేద్దామన్న ఆశయం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు పైప్ లైన్ సక్రమంగా లేనందున అర కోరగా వచ్చిన నీరు కాస్త వీధి కొళాయిలు పనిచేయక రోడ్లపై నీరు వృథాగా ప్రవహిస్తోంది. గ్రామానికి తూర్పు వైపున గల సుమారు 20 గృహాలకు తాగునీరు అందించుటలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పైప్ లైన్ కొంతకాలంగా విరిగి పోయినప్పటికి బాగు చేసేందుకు సంబంధిత అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి ఎన్ని పర్యాయాలు తీసుకువెళ్లిన ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు పాడైపోయిన కుళాయిలు బాగు చేసి గ్రామస్తులకు సక్రమంగా తాగునీరు అందించాలని ప్రజలు కోరారు.