BREAKING
నోట్.. సూర్య కథనానికి స్పందన... ​ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన ఎస్ఈసీ శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్ధుల సేవాభావం ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 కర్టెన్ రైజర్: సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన సీఐఐ ప్రతినిధులు సింగీతం శ్రీనివాసరావుకు ఘన నివాళి సేవా సేతు అభియాన్‌పై.. వినియోగదారులకు అవగాహన.. గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలి అంగరంగవైభవంగా పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతర కాలేజీ రోడ్డులో రెడీమిక్స్ లారీల నిర్లక్ష్యంపై కార్పొరేషన్ సమావేశంలో ఫిర్యాదు విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన జనసేన మల్లయ్య స్థానిక ఎన్నికలకు జిల్లా సిద్ధం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి : ఐటీడీపీపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం ఎల్కపల్లి బస్టాండ్‌లో మరుగుదొడ్ల శుభ్రత ఎంబిబిఎస్ సీటు సాధించిన చోలే నరేష్‌కు ఘన సన్మానం లయన్స్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ప్రపంచ నేత్ర దినం

ఓట్ చోరీపై పోరాటం.. కాంగ్రెస్ నిరసన

Select Suryaa Now
ఓట్ చోరీపై పోరాటం.. కాంగ్రెస్ నిరసన

ఓట్ చోరీపై పోరాటం.. కాంగ్రెస్ నిరసన

రాహుల్‌, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

చేర్యాల: బీజేపీ ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఎఐసిసి పిలుపు మేరకు చేర్యాల పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మండల అధ్యక్షుడు మంజె మల్లేశం ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఓట్‌ చోరీపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, ఎంపీలపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య నిరసనలను అణిచివేసే చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జిలు, గ్రామశాఖ అధ్యక్షులు, పట్టణ, మండల కమిటీ సభ్యులు, మహిళా, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

surya cherial