ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి : ఐటీడీపీపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం అనే లక్ష్యంతో అంతా కలిసి ఐటీడీపీని బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ధీటుగా తిప్పి కొట్టాలన్నారు. ఐటీడీపీ విభాగంపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో లోకేష్ మాట్లాడుతూ ఐటీడీపీ కమిటీలను త్వరగా వేయాలన్నారు. ఐటీడీపీ సభ్యులంతా ‘మై టీడీపీ యాప్’ తో అనుసంధానించాలన్నారు. ఐటీడీపీ మిగిలిన విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సాంకేతికంగా ఎదగాలని సూచించారు. సమీక్షలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ పాల్గొన్నారు.