BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి కృషి చేస్తాం
సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు సలీం పాషా
చేవెళ్ల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 9): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) చేవెళ్ల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని వికారాబాద్ రోడ్డులో గల జీపీఆర్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీమ్ పాషా మాట్లాడుతూ.... జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా కృషి చేస్తామని, ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు కల్పించడం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించడం కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఐక్యంగా పనిచేస్తూ యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

చేవెళ్ల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా గోంగుపల్లి రాఘవేందర్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, కార్యదర్శులుగా వామన్ రెడ్డి, మహేష్, కోశాధికారిగా ఈపూరి రాఘవేంద్ర ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రవణ్ కుమార్, ఈసీ మెంబర్లుగా ఇస్మాయిల్, రమేష్, శివ, సుధాకర్, శివారెడ్డి, ముస్తఫా, బిక్షపతి ఎన్నికయ్యారు. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంతోష్, జిల్లా కమిటీ ఈసీ మెంబర్ గా  మల్లేష్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పడమటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన యూనియన్ నాయకులకు, జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరినీ కలుపుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీశైలం, టీయూడబ్ల్యూజే చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి గోపాల్, షాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ధర్పల్లి రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు కరుణాకర్ చారి, గోపాల్ రావు, దర్శనాల కృష్ణ, సంతోష్ కుమార్ చారి, మల్లేష్, వికారాబాద్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గ రిపోర్టర్లు పూర్ణచందర్, రాజేష్, చంద్రశేఖర్, వినయ్‌తో పాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు.