ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం
కైకలూరు, మేజర్ న్యూస్, జాగృతి ప్రైవేటు పాఠశాల ఎందరో నిరుపేదలైన విద్యార్థులకు విద్యను అందించి వారి జీవిత సుగమం చేయటం విద్య సేవకు నిదర్శనం. అస్సా డెమో క్రటిక్ వారిచే శ్రీకాళహస్తిలో విశిష్ట విద్యా ప్రదాత పురస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు డివిజన్ అస్సా డెమో క్రటిక్ వైస్ ప్రెసిడెంట్ మరియు కైకలూరు జాగృతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ పానేo జయ కిషోర్ బాబుని చైర్ పర్సన్ డాక్టర్ పానేo మౌనిజ కిషోర్ ని విశిష్ట పురస్కారంతో రాష్ట్ర అధ్యక్షులు గొల్లపూడి మోహన్ రావు వారిని ఘనంగా సత్కరించారు. వారి సేవ నిరతిని కొనియాడారు. విద్యార్థులకు మంచి నడతను నేర్పుతో సంస్కారవంతులుగా తీర్చి దిద్దుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు జయ కిషోర్ బాబు విద్యారంగానికి చేసిన చేస్తున్న విశిష్ట సేవలు గురించి అభినందనలు తెలిపారు.
రిపోర్టర్ ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా,