BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి

Select Suryaa Now
మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి


అనకాపల్లి ప్రధాన ప్రతినిధి;మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సంబంధిత అధికారులతో  శనివారం   సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు సమన్వయంతో స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించి, అవి అన్ని విధాలా సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని సూచించారు. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు.
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు రిజర్వేషన్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి అంశంపై స్పష్టతతో వ్యవహరించాలని తెలిపారు. రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
అధికారులు వ్యక్తిగతంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గాలను ఖరారు చేసే సమయంలో రహదారులపై గుంతలు ఉన్నా, రహదారులు ఇరుకుగా ఉండి రాకపోకలకు ఇబ్బందులు ఎదురైనా ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే మరమ్మతులు చేయించి రహదారులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై .సత్యనారాయణ రావు,  ఆర్డీవోలు, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

రవి కుమార్ అనకాపల్లి