పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
పెదవేగి, మేజర్ న్యూస్ :పెదవేగి మండలం, డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో 70వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ 2026-2027 ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూవిద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక వికాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పెరుగుతాయని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సూచించారు.స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలుగతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఇటీవల విడుదల చేసిన డి స్ సి నియామకాల్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద అనేక మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని రాబోయే రోజుల్లో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ పోటీలు 10-10-2026 నుండి 12-10-2026 వరకు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఎస్ జి ఎఫ్ యు/19 ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు.క్రీడాకారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు, గురుకులం సిబ్బంది పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు