BREAKING
*పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్ ఫిలిప్స్ రికాల్ వివాదంలో విజయం సాధించిన డచ్ దిగ్గజం నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు ఈయూ బడ్జెట్‌లో భారీ కోతలకు ఐర్లాండ్ ప్రణాళిక సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్...పోల్ పొజిషన్ కైవసం చేసుకున్న రెడ్ బుల్ రేసర్ వెర్స్టాపెన్ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి

విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం

Select Suryaa Now
విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ మండలంలోని నిమ్మలగూడెం గ్రామానికి సూర్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుప్పాల రిషిత పావని అనే విద్యార్థినికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రూ.10,500 ఆర్థిక సహాయం అందించింది. ఆమె చదువుకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు సంస్థ తరఫున రూ.10,000, మండల అధ్యక్షుడు రూ.500 కలిపి మొత్తం రూ.10,500 అందజేశారు.శనివారం సంస్థ అధ్యక్షుడు తన్నీరు రామకృష్ణ అధ్యక్షతన, బేత రమేష్ ఈ సహాయాన్ని అందించారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో మానవత సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ కేంద్ర కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, కొండ్రెడ్డి సోమరాజు, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షుడు గద్దె సత్యనారాయణ, సభ్యుడు కర్పూరం వెంకన్నబాబు, ఏలూరు ఫణికుమార్, సూర్య కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, తనిష్క జ్యువెలర్స్ యుగంధర్, కండవల్లి ఆశీర్వాదం, పోల్నాటి నరేష్‌తో పాటు మానవత కార్యవర్గ సభ్యులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా