BREAKING
త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్ ఫిలిప్స్ రికాల్ వివాదంలో విజయం సాధించిన డచ్ దిగ్గజం నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు ఈయూ బడ్జెట్‌లో భారీ కోతలకు ఐర్లాండ్ ప్రణాళిక సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్...పోల్ పొజిషన్ కైవసం చేసుకున్న రెడ్ బుల్ రేసర్ వెర్స్టాపెన్ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి బతుకమ్మ వేళా.. లక్ష్మాపూర్‌ రింగ్‌ రోడ్డులో చీకట్లే.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం పోలాండ్‌లో వరుస కత్తిపోటు దాడులు రియాద్ విమానాశ్రయం వద్ద భారీ శబ్దంతో పేలుడు

తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్. చింతపల్లి మేజర్  న్యూస్.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల. స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా తీదేడు గ్రామంలోని రామాలయం వద్ద ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.పూల బతుకమ్మలతో రామాలయం పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల .స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ జరుపుకునే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న మన ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

బతుకమ్మ పండుగ మహిళల జీవితాల్లో ఆనందాన్ని నింపడంతో పాటు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతుందని అన్నారు. గ్రామంలోని మహిళలందరూ ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.తీదేడు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు.

ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి,బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ సందడి చేశారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం,గ్రామ ప్రజలు,గ్రామ మహిళలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.