299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్
మేడ్చల్, మేజర్ న్యూస్ న్యూస్(అక్టోబర్ 10): మేడ్చల్ మాజీ జెడ్పీటీసీ, గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల మహిళలకు, ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని, మహిళలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సాయిపేట శ్రీనివాస్ కోరారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.