ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు మాని.. అందుగుల గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి
*సర్పంచ్ చెక్ పవర్ రద్దు పట్ల ఎమ్మెల్యే కసిరెడ్డి పై జరుగుతున్న అసత్య ఆరోపణలు, ప్రచారాలను ఖండించిన మాజీ సర్పంచ్ జయలక్ష్మి రాజు*
అందుగుల గ్రామ సర్పంచ్ గా తన పదవీ కాలంతో పాటు ప్రత్యేక అధికారుల పాలనలో చేపట్టిన గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి తనకు సుమారు 8 నుండి 9 లక్షల రూపాయల బిల్లులు రావాల్సి వుందని మాజీ సర్పంచ్ అందుగుల జయలక్ష్మి రాజు తెలిపారు. అందుగుల జి.పికి కొత్త పాలకవర్గం ఏర్పడిన తరువాత ప్రభుత్వం పాత బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేయగా అందులో నుండి మాకు రావాల్సిన బిల్లుల గురించి ప్రస్తుత సర్పంచ్ శ్రీనివాస్ ను అడిగి, ప్రాదేయపడ్డా ఆయన కనికరించలేదని తెలిపారు. అంతేగాకుండ గ్రామ సభలలో అడిగి కాళ్ళు మొక్కినా గాని చూద్దాం , తర్వాత ఇస్త అంటూ కాలయాపన చేస్తుండడంతో ఎటూ పాలుపోని నేను, నా భర్త ఆత్మహత్యలే శరణ్యమనుకున్నట్లు మాజీ సర్పంచ్ వివరించారు. మా ఇబ్బందులు గుర్తించిన గ్రామస్థుల సూచన మేరకు మొదట మాడ్గుల ఎంపీవో, ఎంపీడీఓ ఫిర్యాదు చేయగా వారు చెప్పినా గాని తన బకాయి బిల్లులు ఇవ్వడానికి ప్రస్తుత సర్పంచ్ నిరాకరించినట్లు జయలక్ష్మి రాజు తెలిపారు. దీంతో రంగారెడ్డి జిల్లా డిప్యూటి కలెక్టర్ కిరణ్మయి దగ్గర కు వెళ్లి కలవడంతో స్పందించి ఆమె DPO కు సిఫారస్ చేయడంతో ఆయన కూడ అందుగుల సర్పంచ్ ను మా బకాయి బిల్లులు ఇవ్వాలని సూచించినప్పటికి స్పందన లేదని మాజీ సర్పంచ్ తెలిపారు. దీంతో రెండు పర్యాయాలు షోకాజ్ నోటీసులిచ్చి.. రెస్పాండ్ కాకపోవడంతో జిల్లా ఉన్నాతాధికారులు సర్పంచ్ శ్రీనివాస్ చెక్ పవర్ రద్దు చేశారని, ఇందులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గాని, ఆయన పి.ఎ కు గాని ఎలాంటి సంబంధం లేదన్న వాస్తవాన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నవారు గుర్తించాలని జయలక్ష్మి రాజు కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఇమేజ్ కు భంగం కలిగించేలా ప్రతిపక్ష పార్టీ నాయకులతో కలిసి అసత్య ప్రచారాలు చేయడం ఆపి అందుగుల గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలని జయలక్ష్మి రాజు హితవు పలికారు. అదేవిధంగా అందుగులలో ఈనెల 8న జరిగిన కార్యక్రమం గురించి పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, కాంట్రాక్టర్ సత్యనారాయణ , ఎంపీవో కిష్టయ్య, ఎమ్మెల్యే పిఏ స్వతహాగా సర్పంచ్ శ్రీనివాస్ కి చెప్పినప్పటికి వారు కావాలని కార్యక్రమానికి రాకుండా , తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ సర్పంచ్ పేర్కొన్నారు.ఇకనైనా అసత్య ప్రచారాలు మాని గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ సర్పంచ్ జయలక్ష్మి రాజు కోరారు.
-ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల