చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను తొలగించాలని ఢిల్లీకి తరలిన యూత్ కాంగ్రెస్
చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో దేశరాజధానిలో చేపట్టిన ఆందోళనకు మద్ధతుగా శనివారం యువజన కాంగ్రెస్ నాయకులు తరలివెళ్ళారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు గాదెమోని దళపతి గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ కి తరలివెళ్ళారు.
-----
-ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల