BREAKING
మండపేట మున్సిపల్ ఎన్నికల్లో హోరా హోరి పోరు గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌దారుడు దుర్మరణం ఏడేళ్ల తర్వాత రాజమహేంద్రవరం కు మహాఎన్నికలు వడ్డే ఓబన్న కళ్యాణ మండపానికి భూమి పూజ. 55 లక్షలు ఎంపీ నిధులతో నిర్మాణం. పెద్దవీధిలో వైభవంగా దేవీ నవ రాత్రులు నిలిచిపోయిన బలిజ కళ్యాణమండపం కు 30 లక్షలు ఎంపీ నిధులు దేవులనాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి

కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు!

Select Suryaa Now
కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు!

సూర్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా & అల్లవరం డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు స్పష్టం చేశారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మంచినీటి ట్యాంకు నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, పైప్‌లైన్ల ఆధునికీకరణ చేపడుతున్నామని తెలిపారు. దైవాలపాలెం పరిధిలోని ప్రజల చిరకాల కోరిక మేరకు ఈ ట్యాంకు పనులను ప్రారంభించామని, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు దెందుకూరి సత్తిబాబు, రాజు, యాళ్ల దొరబాబు, గునిశెట్టి చిన్నబాబు, మంతెన సురేష్, కంకిపాటి వీరబాబు, గునిశెట్టి రోహిణి కుమార్, అధికార జయలక్ష్మి, అల్లాడి సోంబాబులతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.