BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి ఆర్ధిక సాయం

Select Suryaa Now
మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి ఆర్ధిక సాయం

మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి  40,000 ఆర్థిక సాయం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య :
శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి ఆదివారం ఇటీవల మృతి చెందిన కుటుంబాలవారికి ఆర్ధిక సాయమందించి తన ఉదారతను చాటుకున్నారు. మున్సిపాలిటీకే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ఆత్మకూరు మండలంలోని రూరల్ గ్రామాలకు కూడా విస్తరించి, పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.ఆదివారం 
మొత్తం 4 కుటుంబాలకు 10,000చొప్పున  40,000ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.గ్రామీణ ప్రాంతంలోని వాసిలి ఎస్సీ కాలనీకి చెందిన కర్నాటి మాలకొండయ్య  కుటుంబాన్ని,బండారుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నేలటూరు అచ్చమ్మ  కుటుంబాన్ని,
మున్సిపాలిటీ పరిధిలోని 
14 వ వార్డు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కొణిదెల నారాయణమ్మ కుటుంబాన్ని,20 వ వార్డు ఏకలవ్య నగర్ ప్రాంతానికి చెందిన గురునాథం ప్రసన్న కుటుంబ సభ్యులను పరమేశ్వర రెడ్డి పరామర్శించి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతానికే పరిమితమైన ఈ సేవను, గ్రామాల్లోని పేదల కష్టాలను గుర్తించి మండల వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు నిరంతర అన్నదాన కార్యక్రమం ద్వారా వేలమంది ఆకలి తీరుస్తున్నారు.

కులమతాలకు అతీతంగాపేదరికమే ప్రాతిపదికగా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి గడపకు వెళ్లి పరామర్శిస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు.
"ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ తమ వారి అంత్యక్రియలకు ఇబ్బంది పడకూడదనేదే తన సంకల్పమని 
కంచి పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు సాయం అందుకున్న కుటుంబాలవారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మల్లవరపు జయంద్ర ప్రసాద్ రెడ్డి, ఏ. నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.