తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
గజ్వేల్ ; తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో జిల్లాలు ఆవిర్భవించి దశాబ్దం పూర్తి చేసుకున్న సిద్దిపేట జిల్లా ప్రజలకు దశాబ్ది మహోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గజ్వేల్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి వేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో నిలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ జాతిపిత చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేసిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సమస్య తెలపడానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు వెళ్లే వారమని, వెళ్లిన పనులు కాక వెనుదిరిగి వచ్చి మైళ్ల దూరం పనుల కోసం సంగారెడ్డి జిల్లాకు పోయి బాధపడ్డ రోజులు ఎన్నో చూసామని గుర్తు చేశారు.
కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజాసేవలను ఒకే దగ్గర నుండి అందించడానికి 33 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకు అధునాతమైన రంగులతో నూతన కలెక్టరేట్ నిర్మాణం జరిగిందన్నారు.
నూతన రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారన్నారు, వైద్య విద్యకు ప్రాధాన్యతమిస్తూ 33 జిల్లాలలో 33 వైద్య కళాశాల నిర్మాణం జరిగిందన్నారు, నూతన మండలాలను, నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ గారికి దక్కుతుందన్నారు, పరిపాలన సౌలభ్యం కోసం ఐఓసీల నిర్మాణం జరిగిందన్నారు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతమిస్తూ ప్రతి ఎకరానికి సాగునీరు అందించడానికి కాలేశ్వరం కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు, మిషన్ భగీరథ బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి త్రాగినీరు సరఫరా చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు, యువతకు ఉపాధి పరిశ్రమలకు ఊతమిస్తూ ఐటి కారిడార్ల ను అభివృద్ధి చేశారన్నారు. రైతే రాజు లక్ష్యంగా రైతాంగానికి రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు పంటలను మద్దతు ధరను ఇస్తూ కొనుగోలు చేయడం, రైతాంగానికి నాణ్యమైన విత్తనాల ఎరువుల సరఫరా చేసిన ఘనత కేసిఆర్ ది అన్నారు, పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్ష రూపాయల ప్రోత్సాహం అందించిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు, ఆసుపత్రుల నిర్మాణం, బస్తీ దవఖానాల నిర్మాణం జరిగిందన్నారు, వృద్ధులకు వికలాంగులకు మహిళలకు చేనేత గీతా నేత కార్మికులకు పెన్షన్లను అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు, తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఊరికి పోయినా ఏ ఇంటి తలుపు తట్టిన కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు కనిపిస్తాయని అన్నారు.అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు, పూటకో మాట మాట్లాడుతూ డైలీ డైవర్షన్ రాజకీయాలను చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ అవినీతి అక్రమాలకు కబ్జాలకు పాల్పడుతూ పాలనను గాడికి వదిలేసి, రైతులను నిండా ముంచుతూ, తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ రాజకీయంగా ఆర్థికంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారుతెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మార్క్ డెవలప్మెంట్ ఏమీ లేదని ఎద్దేవా చేశారుఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులున్నారు