BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ :

Select Suryaa Now
 ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ :

సూర్య జాతీయ క్రైమ్ డెస్క్: నకిలీ పోలీసు లేదా సైనిక అధికారి ముసుగులో అమాయకులను మోసం చేస్తున్న ముఠాల జాబితాలోకి మరో కేటుగాడు చేరాడు. తాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) అధికారినంటూ ప్రచారం చేసుకుంటూ.. ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు, దుబాయ్ నుంచి చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద లక్షలాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాడిని గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు చెందిన అజ్మా ఏ సికిందర్ అక్తర్ కాంబోజ్ అనే నిందితుడు సీఐఎస్‌ఎఫ్ టీషర్ట్ ధరించి, నకిలీ గుర్తింపు కార్డుతో అహ్మదాబాద్‌లోని పాలికా బజార్ సమీపంలో తిరుగుతూ ప్రజలను నమ్మించేవాడు. విమానాశ్రయంలో కీలక అధికారినంటూ కలరింగ్ ఇస్తూ నిరుద్యోగులకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆర్మీ క్యాంటీన్ సరుకులతో పాటు దుబాయ్ నుంచి అతి తక్కువ ధరకే ఒరిజినల్ ఐఫోన్లు సమకూరుస్తానని నమ్మబలికాడు.

బాధితుల నుంచి భారీగా నగదు, ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా సొమ్ము వసూలు చేసి వ్యక్తిగత జల్సాలకు ఖర్చు చేశాడు. ఈ లావాదేవీల కోసం ట్రావెల్ ఏజెన్సీలు, పెట్రోల్ పంపుల బ్యాంకు ఖాతాలను సైతం ఉపయోగించినట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి నకిలీ ఐడీ కార్డు, నగదు, మొబైల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతనిపై జమ్మూకశ్మీర్‌లోని మజ్‌గావ్ పీఎస్‌లో కూడా చీటింగ్, చోరీ కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.