వి.హెచ్.పి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
- అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గట్టి రామ్మోహన్ పిలుపు
- మదనపల్లిలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఆదివారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి నిమ్మనపల్లి,తంబళ్లపల్లి,కలికిరి,వాల్మీకిపురం ప్రఖండాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సమావేశంలో గత నెలలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సమీక్షించడంతోపాటు,రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.అదేవిధంగా దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గాష్టమి కార్యక్రమాలను అన్ని ప్రఖండాల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.అశోక్ సింఘాల్ జీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని,ప్రాంత స్థాయి నుంచి సూచించిన కార్యక్రమాలను అన్ని ప్రఖండాల్లో విస్తృతంగా నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్ కార్యకర్తలకు సూచించారు.ప్రతి ప్రఖండంలో విస్తృతంగా పర్యటిస్తూ కొత్త కార్యకర్తలను సంఘటిత పరచాలని,విశ్వహిందూ పరిషత్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని,దేశం,ధర్మం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.విశ్వహిందూ పరిషత్ ఆశయాలు,ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార్యదర్శి ఇర్రి నాగప్రసాద్ నాయుడు,జిల్లా కోశాధ్యక్షులు పోలూరు సుధాకర్,రెడ్డెయ్య,విశేష సంపర్క ప్రముఖ్ సత్యనారాయణరావు,గ్రామీణ సహ కార్యదర్శి సుబ్బారెడ్డి,పట్టణ సేవా ప్రముఖ్ ఈశ్వర్ రెడ్డి,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి