శ్రీమహమ్మారమ్మ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు
- పదిరోజులుపాటు కొనసాగనున్న ఉత్సవాలు
- జయప్రదం చేయాలని ఆలయ కమిటీ పిలుపు
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి పట్టణం ఎస్బిఐ కాలనీ నందు వెలసిన శ్రీమహమ్మారమ్మ తల్లి దేవస్థానం నందు ఆదివారం నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగునున్నాయని ఆలయ కమిటీ ప్రకటించింది.ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు భక్తులు,ఆలయ కమిటీ సభ్యులు ఆధ్యాత్మిక పండుగ వాతావరణంలో ప్రారంభించారు.మొదటి రోజు ఆలయంలో అమ్మవారికి పంచామృతా భిషేకం,తీర్థప్రసాద వినియోగము,లలిత సహస్రనామ కుంకుమార్చన,ప్రాకారోత్సవం,అమ్మవారికి దశ విదహారతులు,మహా మంగళ హారతి నిర్వహించారు.అమ్మవారు నేడు పసుపుతో గంగా భవాని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఇందులో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొమ్మాడి రామకృష్ణారెడ్డి,గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,నాదెళ్ళ వెంకటేశ్వర ప్రసాద్ (శివన్న),డి.ద్వారకనాథ రెడ్డి,వైస్ చైర్మన్
కొండుపల్లి ప్రసాద్ బాబు,సెక్రటరీ గంగాసాని మస్తాన్ రెడ్డి,ట్రెజరర్ పి.వి.శ్రీనివాసరామమూర్తి (భవాని శ్రీను) జాయింట్ సెక్రటరీ ఎస్.మాధవ రెడ్డి
కో-ట్రెజరర్ బిఎం.వెంకటరమణ,ఆలయ ట్రస్టీలు బి.వెంకటేశ్వర రెడ్డి,శ్రీరామ సహదేవ నాయుడు,మారువేణి వెంకట్రాయుడు పర్యవేక్షణలో వేడుకలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా దసరా శరన్నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతొందని తెలిపారు.కావున పుర ప్రజలు అమ్మవారి భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్బిఐ కాలనీ సంబంధించిన ప్రముఖులు,అమ్మవారి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి