1982 నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో ఘన గౌరవం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మేజర్ న్యూస్.
మానేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కుడిపూడి సత్యనారాయణ 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే తొలి సభ్యత్వం స్వీకరించి, నాటి నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ విశేష సేవలందిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ నేటి సిద్ధాంతాలే ఆశయంగా, ప్రజాసేవే లక్ష్యంగా దశాబ్దాలుగా నిబద్ధతతో కొనసాగుతున్న ఆయన సేవలను గుర్తించి, పి. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ మోకా ఆనంద సాగర్ ఆయన పాదాలకు నమస్కరించి గౌరవించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాటి నుంచి కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యత, వారి సేవలకు అందిస్తున్న గౌరవం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకతకు నిదర్శనం. పార్టీ కోసం జీవితకాలం అంకితభావంతో పనిచేసిన సీనియర్ కార్యకర్తలను గౌరవించడం, వారి సేవలను గుర్తించడం పార్టీ సంప్రదాయానికి ప్రతీక.
ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న సీనియర్ కార్యకర్తల అనుభవం, అంకితభావం నేటి యువ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం. వారి సేవలను గౌరవించుకుంటూ, వారి అడుగుజాడల్లో ప్రజాసేవను కొనసాగించడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవం