telanagana
బతుకమ్మ వేళా.. లక్ష్మాపూర్ రింగ్ రోడ్డులో చీకట్లే.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం
Telanagana
10 Oct 2026
244 views
By సూర్య ప్రతినిధి
Updated : 10 Oct 2026 20:35 IST
Select Suryaa Now
శామీర్‌పేట, మేజర్ న్యూస్(అక్టోబర్ 10):బతుకమ్మ పండుగ వేళా.. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామ రింగ్ రోడ్డులో చీకట్లు అలుముకున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రధాన కూడలి వద్ద వీధి దీపాలు వెలగకపోవడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పండుగ సమయంలోనూ కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బతుకమ్మ పండుగకు ముందుగానే వీధి దీపాలను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన కూడలి చీకటిమయంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి లక్ష్మాపూర్ రింగ్ రోడ్డులోని ప్రధాన కూడలి వద్ద వీధి దీపాలను వెంటనే పునరుద్ధరించాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించకుండా, పండుగల సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సమస్యను తక్షణమే పరిష్కరించి, రహదారిపై వెలుగులు నింపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్ శామీర్ పేట్, మేడ్చల్ జిల్లా.