BREAKING
మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మామిండ్ల ముత్యాలు యాదవ్ మండపం

Select Suryaa Now
శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మామిండ్ల ముత్యాలు యాదవ్ మండపం

 

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 10): శ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఘట్‌కేసర్ ‌లోని మహంకాళి దేవాలయం పక్కన అమ్మవారి ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మామిండ్ల ముత్యాలు యాదవ్, కార్తీక్ యాదవ్ ఆధ్వర్యంలో మండపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో కొండలు, జలపాతాలు, పచ్చని వృక్షాలు, కమల పుష్పాల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామివారి రూపాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో రూపొందించారు. బంగారు వర్ణపు కాంతులతో స్వామివారి రూపం, నీలిరంగు కొండల నేపథ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు, ఎదులాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ కమాన్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కమాన్లకు ఇరువైపులా వివిధ రంగుల దీపాలతో అలంకరించగా, పైభాగంలో రాధాకృష్ణుల రూపాన్ని విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు మామిండ్ల ముత్యాలు యాదవ్, కార్తీక్ యాదవ్ కోరారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సర్వ ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు.

 

రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.