BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం

Select Suryaa Now
బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర  -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం

ఏలూరు, మేజర్ న్యూస్ : బీసీలను రాజకీయంగా ఎదగనివ్వకూడదనే కుట్రతోనే వైసీపీ నాయకులు 34శాతం రిజర్వేషన్‌ల అమలును అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధ్వజమెత్తారు. అటువంటి వైసీపీకి చెంపపెట్టుగా రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలంతా ఏకపక్షంగా కూటమి వైపు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల సమావేశాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత దక్కకపోయినా,, పార్టీ పరంగా అంతేశాతం రిజర్వేషన్‌లను బీసీలకు కేటాయించేలా సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు తొలినుండి రాజకీయంగా అగ్రపీఠం వేసింది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. ఇదేక్రమంలో దాన్ని కూటమి ధర్మంగా మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా 34శాతం రిజర్వేషన్‌లను బీసీలకు కల్పించేందుకు చర్యలు చేపడితే,,, దానిపై కోర్టుకెళ్ళిన ఘనత వైసీపీకే దక్కుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే తమ పార్టీకి మనుగడ అసాధ్యమనే అభద్రతతోనే రిజర్వేషన్లను అడ్డుకుంటూ వచ్చారని పేర్కొన్నారు. వారికి చెంపపెట్టుగా బీసీలంతా కూటమి వైపు నిలవాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. సమావేశంలో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ బీసీ నాయకులు బౌరోతు బాలాజీ, బాడిశెట్టి శ్రీనివాసరావు, జంపా సూర్యనారాయణ, పైడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము ఏలూరు జిల్లా ఇంచార్జ్