ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం
ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం
చేర్యాల: జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు, చేర్యాల మండల అధ్యక్షులు మంజ మల్లేశం ఆధ్వర్యంలో ఆకునూరు గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆకునూరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజును నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా పెద్ద ముత్తని పోశయ్య, పౌడాల శివకృష్ణ, యూత్ అధ్యక్షుడిగా ఉడుత బాలరాజును నియమించారు. జనరల్ సెక్రటరీగా కొల్లిపాక వెంకటయ్య, సెక్రటరీగా సయ్యద్ అజారుద్దీన్‌లకు బాధ్యతలు అప్పగించారు.ఈ నియామకాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి నూతనంగా నియమితులైన నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.