రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం బొబ్బిలి పట్టణ మాజీ వార్డు కౌన్సిలర్లతో బొబ్బిలి మాజీ శాసనసభ్యులు, బొబ్బిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాయకులు మరియు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలి. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ, ప్రజలకు అందుబాటులో ఉండాలి” అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, విజయనగరం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శంబంగి వేణు గోపాల్ నాయుడు, బొబ్బిలి పట్టణ అధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, విద్యాసంస్థల అధినేత భాస్కరరావు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దల సత్యనారాయణ, బొబ్బిలి మాజీ వైస్ చైర్మన్ రమాదేవి మరియు బొబ్బిలి పట్టణ ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.