BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

రంగురంగుల పూలతో ప్రకృతికి పూజలు

మేడ్చల్ ,మేజర్ న్యూస్(అక్టోబర్ 10): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగలో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గ్రామంలోని శివాలయం వద్దకు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలకు పూజలు నిర్వహించి, వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. మహిళల సందడి, బతుకమ్మ పాటలతో శివాలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత. మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను గ్రామ మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నూతనకల్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

 

రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.