BREAKING
యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ :

పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీ

Select Suryaa Now
పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీ

 

పోలీస్ విధులు, ప్రజాసేవపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం

 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్ 10): పోలీస్ ఫ్లాగ్ డే–2026ను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (డీటీసీ)లో పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.పోలీస్ సిబ్బందిలో రచనా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడంతో పాటు పోలీస్ విధులు, బాధ్యతలు, ప్రజాసేవ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రపై అవగాహన పెంపొందించడమే పోటీ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించడం, ప్రజల గౌరవం, విశ్వాసాన్ని పొందడం, క్షేత్రస్థాయిలో పోలీసింగ్‌ను బలోపేతం చేయడం, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించడం వంటి అంశాలపై సిబ్బంది తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తం చేసేలా ఈ పోటీ నిర్వహించారు.ఇలాంటి కార్యక్రమాలు పోలీస్ సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడతాయని పోలీస్ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్‌ఐ శ్రీశైలం, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.