BREAKING
నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు ఈయూ బడ్జెట్‌లో భారీ కోతలకు ఐర్లాండ్ ప్రణాళిక సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్...పోల్ పొజిషన్ కైవసం చేసుకున్న రెడ్ బుల్ రేసర్ వెర్స్టాపెన్ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి బతుకమ్మ వేళా.. లక్ష్మాపూర్‌ రింగ్‌ రోడ్డులో చీకట్లే.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం పోలాండ్‌లో వరుస కత్తిపోటు దాడులు రియాద్ విమానాశ్రయం వద్ద భారీ శబ్దంతో పేలుడు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను తొలగించాలని ఢిల్లీకి తరలిన యూత్ కాంగ్రెస్ అవనిగడ్డలో ఉషశ్రీ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం- ఎమ్మెల్యే మండలి శ్రీకాళహస్తి పాలకమండలి సభ్యులకు తటవర్తి రమేష్ ఆత్మీయ ఆతిథ్యం ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు మాని.. అందుగుల గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.. రవి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు స్పెయిన్ రాజకీయాల్లో సెంట్రిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రముఖ లాయర్ మిరియం పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఫ్రెషర్స్ సందడి. ముప్పవరంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవ శోభ: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శిరిడీ సాయిబాబా దేవస్థానం.

దుర్గా మాత ఉత్సవాలు భక్తిభావంతో నిర్వహించాలి

Select Suryaa Now
దుర్గా మాత ఉత్సవాలు భక్తిభావంతో నిర్వహించాలి

దుర్గా మాత ఉత్సవాలు భక్తిభావంతో నిర్వహించాలి

-నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

-శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలి

-రూరల్ సీఐ విద్యాసాగర్

సిద్దిపేట రూరల్ : దుర్గా మాత ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రూరల్ సీఐ విద్యాసాగర్ సూచించారు. ఉత్సవాల సందర్భంగా పోలీసుల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దుర్గా మాత ఉత్సవాలు భక్తికి, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని, ప్రతి ఒక్కరూ భక్తిభావంతో పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఉత్సవ మండపాల ఏర్పాటుకు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, విద్యుత్‌ దీపాలంకరణ, విద్యుత్‌ తీగల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండాచూసుకోవాలన్నారు.అలాగే మైకుల వినియోగంలో పోలీసుల నిబంధనలు పాటించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అధిక శబ్దంతో పాటలు ప్రసారం చేయకూడదని సూచించారు. ఉత్సవాల సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు, గొడవలకు తావివ్వకూడదని,అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన లేదా ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండపాల నిర్వాహకులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఉత్సవాల పేరుతో ప్రజలకు అసౌకర్యం కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటం సహించబోమని తెలిపారు. పోలీసుల సూచనలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి నిర్వాహకుడు బాధ్యతగా వ్యవహరించాలని, దుర్గా మాత ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. భక్తి, క్రమశిక్షణ, ఐక్యతతో ఉత్సవాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.