BREAKING
జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ గాంధీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ 299 డివిజన్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్ ఫిలిప్స్ రికాల్ వివాదంలో విజయం సాధించిన డచ్ దిగ్గజం నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు

అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 

శాలిగౌరారం:

మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో మహిళల కోలాహలం, పండుగ సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గ్రామ సర్పంచి కట్ట లక్ష్మమ్మ, వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సద్దుల బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు గ్రామంలో సంప్రదాయాల పరిరక్షణకు, ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి.