telanagana
ఆకలితో ఎవరూ ఉండకూడదనే సంకల్పంతో అన్నదానం.. తాళ్లపల్లి రమేష్ గుప్తా సేవలకు ప్రశంసలు
Telanagana
10 Oct 2026
53 views
By సూర్య ప్రతినిధి
Updated : 10 Oct 2026 20:22 IST
Select Suryaa Now
మేడ్చల్, మేజర్ న్యూస్, (అక్టోబర్ 10):అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదనే భావనతో, ఆకలితో ఎవరూ ఉండకూడదనే సదుద్దేశంతో శ్రీపాద వల్లభా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు తాళ్లపల్లి రమేష్ గుప్తా ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు పట్టణంలోని ఏడు గుండ్ల దేవాలయం సమీపంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా తాళ్లపల్లి రమేష్ గుప్తా మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంతో సంతృప్తినిచ్చే సేవా కార్యక్రమమని అన్నారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే మంచి సంకల్పంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు, అవసరమైన వారికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు.
సేవాభావానికి స్థానికుల ప్రశంసలు
ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న తాళ్లపల్లి రమేష్ గుప్తా సేవలను స్థానికులు అభినందిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఆహారం అందించడం అభినందనీయమని పేర్కొంటున్నారు. రమేష్ గుప్తాకు భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని, భవిష్యత్తులోనూ మరింత మందికి సేవ చేసే శక్తిని, అవకాశాలను కల్పించాలని ఆకాంక్షిస్తున్నారు.సేవే లక్ష్యంగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.