నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు.
సూర్య న్యూస్ దర్శి.
నేరాల నియంత్రణ ప్రజలను అప్రమత్తం చేసేందుకే కార్డెన్ సెర్చ్ అని దర్శి సిఐ నరహరి నాగమల్లేశ్వరరావు అన్నారు. జిల్లా యస్. పి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డిఎస్పి పి..బాలమురళీ కృష్ణ సూచనల మేరకు రాబోవు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిఐ ఎన్ .నాగమల్లేశ్వరరావు దర్శి ఎస్సై G.ఏడుకొండలు ముండ్లమూరు ఎస్సై పి..కోటేశ్వరరావు తాళ్లూరు ఎస్సై ఎస్.మల్లికార్జున రావు కురిచేడు ఎస్ఐ జి..కోటయ్య , సర్కిల్ సిబ్బంది దర్శి టౌన్ లోని క్రిస్టియన్ పాలెం నందు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ పాలెం నకు సంబంధించినటువంటి వారితో సిఐ నాగమల్లేశ్వర రావు మాట్లాడుతూ రానున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ సంబంధించి కాలనీలో ట్రబుల్ మాంగర్స్ గురించి ఆరా తీశారు . క్రిస్టియన్ పాలెం లో ప్రశాంతమైన వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుట కొరకు ప్రజలందరూ కూడా సహకరించాలని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నాగమల్లేశ్వర రావు హెచ్చరించారు.