BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి!

Select Suryaa Now
పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి!

చిన్నకోడూరు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు చిన్నకోడూరు మండలవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, చిన్నారులు సందడి చేశారు. మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామంలో మహిళలు ఏకరూప దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి వీధుల్లోకి చేరుకున్నారు. బతుకమ్మల చుట్టూ వలయంగా నిలబడి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.పూల పరిమళాలు, మహిళల బతుకమ్మ పాటలు, చిన్నారుల కేరింతలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. రంగురంగుల బతుకమ్మలతో గ్రామ వీధులు కళకళలాడాయి.పల్లెల్లో పండుగ శోభను నింపుతూ ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.