జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక
భోగాపురం, సూర్య : నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి నాయకత్వం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై భోగాపురం మండలం రామచంద్రపేటకు చెందిన సుమారు 60 కుటుంబాల యువత వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలో చేరారు. ముంజేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, యువతకు అండగా ఉంటూ ప్రజలకు అందుబాటులో సేవలు కొనసాగిస్తామని తెలిపారు. చేరికల్లో కీలక పాత్ర పోషించిన రామచంద్రపేట జనసేన సీనియర్ నాయకుడు నోడగల రాముని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతోపాటు మండల పార్టీ అధ్యక్షులు వందనాల రమణ, సీనియర్ నాయకుడు మట్ట అయ్యప్ప రెడ్డిని అభినందించారు. పార్టీలో చేరిన వారిలో దువ్వు వెంకటరావు, నీలాతి కొత్తయ్య, నమ్మి రమణ, కోలా అప్పలనరసయ్య, బెపల కృష్ణ, నక్క పెద్దరాము, పిట్ట రాములు, బమ్మిడి రాములు, నక్క శ్రీను, కోలా కొత్తయ్య, పల్ల రామసూరి తదితరులు ఉన్నారు.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.