BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

Select Suryaa Now
వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన విద్యార్థులు

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్:బొంరాస్‌పేట్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో శనివారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పూల బతుకమ్మలను అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో పండుగ సందడి నెలకొంది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని తెలిపారు. విద్యార్థులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నర్సిములు, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉపాధ్యాయులు నిరోషా, శ్యామల, యాదమ్మ, విజయలక్ష్మి, ప్రమీల, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్:శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.