BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు:సర్పంచ్ జంగం వీరయ్య

Select Suryaa Now
పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు:సర్పంచ్ జంగం వీరయ్య

అల్లాపూర్‌లో వీధి దీపాల ఏర్పాటు

బషీరాబాద్,మేజర్ న్యూస్( అక్టోబర్ 10):వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం పలు వీధుల్లో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేశారు. శనివారం గ్రామ సర్పంచ్ జంగం వీరయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని వీధులు రాత్రి వేళల్లో వెలుగులతో ఉండేలా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ జంగం వీరయ్య మాట్లాడుతూ.. పండుగ వేళల్లో గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కనిగిరి శామప్ప, ప్రశాంత్, అంజిలప్ప, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.