త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి*
*ఎన్నికల సామగ్రి, సిబ్బంది, శిక్షణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి*
*పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, అక్టోబర్ 10: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో అధికారులు ముందస్తుగా సమగ్ర ఏర్పాట్లు చేపట్టి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది నియామకం, శిక్షణ, భద్రత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... త్వరలో రానున్న పురపాలక, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర కనీస మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్ట్రాంగ్ రూమ్లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను గుర్తించి, వాటిలో ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చేపట్టాల్సిన అదనపు ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రవాణా మార్గాలు, పోలింగ్ పార్టీల రాకపోకలకు సంబంధించిన ప్రణాళికను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్టేషనరీతో పాటు ఇతర ఎన్నికల సామగ్రిని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రిజర్వ్ బ్యాలెట్ బాక్సుల కేటాయింపు, భద్రత, పంపిణీ, పోలింగ్ అనంతరం తిరిగి స్వీకరణకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీమ్ తదితర టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను ముందుగానే అంచనా వేసి, నిబంధనల ప్రకారం సమర్థులైన సిబ్బందిని గుర్తించి విధులు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఎన్నికల అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ఎన్నికల నిబంధనలు, విధులు, బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియపై ప్రతి ఉద్యోగికి పూర్తి అవగాహన కల్పించాలని, తద్వారా ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ రోజుకారోజు నివేదికలు పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
*19 అంశాలపై నోడల్ అధికారుల నియామకం*
ఎన్నికల నిర్వహణకు సంబంధించి 19 కీలక అంశాల నిర్వహణ కు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి నోడల్ అధికారి తనకు కేటాయించిన అంశంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక, కాలపట్టిక రూపొందించుకొని, సంబంధిత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల సమీకరణ, కేటాయింపు, పంపిణీ, పోలింగ్ అనంతరం స్వీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రి నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలు, స్ట్రాంగ్ రూమ్లు, పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు, నామినేషన్ ల స్వీకరణ, ఎంసీసీ అమలు, రవాణా, రోజువారీ నివేదికల సమర్పణ, మీడియా మేనేజ్మెంట్ తదితర 19 విధుల నిర్వహణపై ఆయా అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, అందుకు సంబంధించిన ఎన్నికల కమిషన్ నిబంధనలను క్షుణ్ణంగా చదువుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సున్నిత, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అదనపు భద్రతా చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు.. ఎన్నికల నియమావళి అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల స్వీకరణ, ఓట్ల లెక్కింపు, ఎన్నికల అనంతర ప్రక్రియలు పూర్తయ్యే వరకు నోడల్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 484 గ్రామ పంచాయతీ సర్పంచులు, 5100 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, అలాగే, 26 జడ్పీటీసీలు,432 ఎంపీటీసీ
లకు ఎన్నికలు జరుగుతాయని, ఇందుకు సంబంధించి కూడా ముందస్తుగా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జడ్పీ సీఈవో,.డిపివో లను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులు, పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఒక్కోసారి సింగిల్ డిజిట్ ఓట్ల కోసం సమస్యలు ఏర్పడతాయని, అందువల్ల అధికారులు చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. నామినేషన్లకు సంబంధించి ముందుగానే అభ్యర్థులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు.
కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, డిపివో భాస్కర్ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నోడల్ అధికారులు పాల్గొన్నా