BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు

Select Suryaa Now
అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు

అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని మినీ క్రీడా మైదానంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో 52వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారిణులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు అశ్వారావుపేట వేదిక కావడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రీడాకారిణులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా బాలికలు క్రీడల్లో మరింతగా రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.

అశ్వారావుపేటలో నిర్వహించనున్న ఈ కబడ్డీ పోటీలను విజయవంతం చేసేందుకు క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు.

సూర్య ప్రతినిధి మునీర్ అశ్వరావుపేట